తూర్పు నియోజకవర్గం లో రెండో డివిజన్ 26 వ సచివాలయం గుణదల మేరీమాత బి హెచ్ నగర్ కొండ ప్రాంతంలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్ తో పాటు స్థానిక రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలతో పాటు , తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. కొండ ప్రాంతాలలో మెట్లు మార్గంలో రెండువైపులా లక్షల రూపాయలు నిధులు వెచ్చించి రైలింగ్ పనులు పూర్తి చేసామని చెప్పారు.
గత ప్రభుత్వాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకునేందుకు లబ్ధిదారులు అనేక అవస్థలకు గురయ్యారని , వైసిపి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే వాలంటరీ వ్యవస్థ , సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తామని చెబుతున్న ప్రతిపక్షాలకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలో గత కొన్ని ఏళ్లగా ఇల్ల పట్టాల సమస్య అధికంగా ఉందని , అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు , సచివాలయ సిబ్బంది , వాలంటరీలు , సిబ్బందితోపాటు నగరపాలక సంస్థ అధికారులు , వైసీపీ నాయకులు పాల్గొన్నారు.