పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘‘తరాలుగా వెనుకబాటుకు గురవుతూ వస్తున్న ఉత్తరాంధ్రకు చేయూతనివ్వాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయానికి అండగా నిలబడాల్సిన బాధ్యత, అవసరం మనపై ఉంది. మన ప్రాంత ప్రజల కోరికను తీర్చుకోవడానికి గొంతెత్తి వీధులోకి వచ్చి అందరినీ చైతన్యవంతులను చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం’’ అని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ‘మన విశాఖ – మన రాజధాని సదస్సు’కు మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.