గుజరాత్ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనతో అంతులేని బాధను అనుభవించినట్లు చెప్పారు ప్రధాని మోదీ. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది చనిపోయారు. తప్పనసరి పరిస్థితుల్లో తాను కేవడియాలో ఉన్నా, తన ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించేనని మోదీ అన్నారు. తన గుండె నిందా విషాదం నిండి ఉందన్నారు. గుజరాత్ సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, వాటిల్లో ఎలాంటి అలసత్వం ఉండదని హామీఇచ్చారు.