ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనుంది. 7వ వేతన సంఘం కింద వేతనాల్లో పెద్ద మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) అందుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేలు. దీనిని రూ.26000కు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.