మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు ఎన్సీపీ ట్వీట్ చేసింది. 81 ఏళ్ల శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపింది. ఆయన ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.