అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సోమవారం పరామర్శించారు. రేపల్లె రూరల్ మండలం చోడాయపాలెం గ్రామానికి చెందిన రత్నబాబు సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆస్పత్రికి వెళ్లిన ఎంపీ మోపిదేవి రత్నబాబు సతీమణిని పరామర్శించి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఎంపీ మోపిదేవికి రత్నబాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.