ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 06:14 PM

ఎస్సీ ఎస్టీ కేసులో టీడీపీ నేతలు, ఉదయం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత , ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజులతో పాటు స్ధానిక నేతలు కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది పులివెందుల నియోజకవర్గంలో దళిత మహిళ హత్యకు గురైంది. దళిత మహిళకు మద్దతుగా పులివెందులలో ర్యాలీ చేసిన 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనిత  మాట్లాడుతూ... కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం నడుస్తోందని విమర్శించారు. దళితులమైన తమపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని.. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. సీఎం జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారని అనితహెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com