భరతమాత ముద్దుబిడ్డగా, దేశ సైనికుడిగా దేశ రక్షణలో పాలుపంచుకున్న నాపైనే వైసిపి గుండాలు దాడి చేసి నాపై హత్యాయత్నం చేయబోయారు. ఈ దేశ పౌరుడిగా మనకు నచ్చిన పార్టీలో మన భావాలను వ్యక్తపరిచే హక్కు లేదా...?? స్థానిక సమస్యలపై మాట్లాడే హక్కు కూడా రాజ్యాంగం కల్పించలేదా...?? సైనికుడిగా దేశానికి సేవ చేసిన నాపైనే దాడి చేసి చంపబోయారంటే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని (రిటైర్డ్ ఆర్మీ) సైనికుడు బారీ సైదా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరిగిందో కానీ సోషల్ మీడియా లో మాత్రం వైరల్ గా మారింది.