ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రేపటి నుంచి అమల్లోకి రావాల్సిన నిషేధం. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారుల విజ్ఞప్తి చేసినందున వారి విజ్ఞప్తిని సీఎం దృష్టికి అధికారులు తీసుకువెళ్లగా సీఎం సానుకూలంగా స్పందించినారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసారు. పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలన్న సీఎం. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సి తయారీ దారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం. తాజా నిర్ణయంతో ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26 కి వాయిదా. పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం.కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ప్రభుత్వం.