గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. టెన్త్ చదివే బాలికను ఇద్దరు ఫ్రెండ్స్ బైక్‌పై శనివారం మధ్యాహ్నం తీసుకెళ్లారు. హోటల్ గదిలోకి పార్టీ ఉందని తీసుకెళ్లి మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బాలికను వదిలేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులలో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.