దేశంలోనే తొలి కర్బన రహిత మూత్రశాలను నిర్మించింది పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన రుహానీ వర్మ. 4 లక్షల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులతో ఇటుకలు తయారుచేసి, అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో ఒక టాయిలెట్‌ను నిర్మించింది. దానికి ‘టాయిలెట్ 01’గా పేరు పెట్టింది. దీని నిర్మాణానికి 30 శాతం ప్లాస్టిక్ బ్యాగులు, మిగతా 70 శాతం వ్యర్థ పదార్థాలు, సిలికా డస్ట్ వాడింది.