మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దారుణానికి తెగించింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతేర్చింది. భర్తను సమోసాలో ఎలుకల మందు పెట్టి చంపి.. ఆ తరువాత మృతదేహాన్ని ఇంటిముందున్న గడ్డివాములో దాచింది. ఏడాదిన్నర పాటు గడ్డివాములోనే ఉంచిన తరువాత అస్తిపంజరాన్ని తీసుకెళ్లి అడవిలో పడేసింది. ఆ అస్తి పంజరమే ఆ మహిళను పోలీసులకు పట్టించింది. మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడి భార్య రంజనతో పాటు సోదరుడు గులాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.