T20 వరల్డ్ కప్ 2022లో భాగంగా, బ్రిస్బేన్‌లో ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంక మధ్య జరిగిన సూపర్-12 మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లంక బౌలర్లపై అఫ్గాన్ ఓపెనర్లు పరుగులు రాబట్టారు. వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్ 24 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ 27 బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. నజీబుల్లా జద్రాన్ 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లంతా స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. కెప్టెన్ మహ్మద్ నబీ 13 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు, లాహిర్ కుమార్ రెండు వికెట్లు తీశారు. కసున్ రజిత, ధనుంజయ డిసిల్వా ఒక్కో వికెట్ తీశారు. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ధనుంజయ డిసిల్వా 42 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కుసాల్ మెండిస్ 25 పరుగులు, చరిత్ అసలంక 19, రాజపక్సే 18 పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. ఈ విజయంతో శ్రీలంక గ్రూప్-1లో మూడో స్థానానికి ఎగబాకింది. అయితే శ్రీలంక సెమీస్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే గ్రూప్-1, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి రెండు జట్లు సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది. గ్రూప్-1లో న్యూజిలాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.