ఏపీలోని విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పునకు గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ అంశంపై మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇకపై ఎన్టీఆర్ వర్సిటీ బదులు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు అధికారికంగా మారినట్లైంది. రెండు నెలలక్రితం వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ వర్సిటీ పేరుమార్పుపై బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.