మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఓ పెయింట్ షాపులో ఘర్షణ జరిగింది. నాలుగు రోజుల క్రితం ఓ లేడీ కానిస్టేబుల్, తన కుమారుడు, సోదరుడితో కలిసి పెయింట్ దుకాణానికి వచ్చింది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ ఏర్పడింది. తనను ఉచితంగా పెయింట్ ఇవ్వమని అడిగారని, డబ్బు కూడా డిమాండ్ చేశారని షాపు యజమాని చెప్పాడు. తాను నిరాకరించడంతో దాడి చేశారని, తాము కూడా తిరిగి దాడి చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ ఘర్షణకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.