గుంటూరు కి చెందిన నల్లూరి నాగేశ్వరరావు అదే ప్రాంతానికి చెందిన సరోజిని అనే మహిళ వద్ద ఇన్నోవా కారు కొనుగోలు చేసి రూ. 7 లక్షల నగదు చెల్లించారు. వాహనం రిజిస్ట్రేషన్ తన పేరుతో మార్చి అప్పగించాలని నాగేశ్వరరావు కోరారు. సదరు మహిళ రిజిస్ట్రేషన్ చేయ కుండా, వాహనం అప్పగించకుండా కాలయాపన చేసింది. తాను చెల్లించిన నగదు వాపసు ఇవ్వాలని కోరగా అందుకు నిరాకరించింది. దీంతో సరోజిని పై చీటింగ్ కేసు నమోదు చేశారు.