పవన్ కంటే కేఏ పాల్ నయం… 175 సీట్లు పోటీ చేస్తాం అని చెబుతున్నాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం పెట్టినట్లు చిత్రీకరిస్తున్నారు. అన్ని వర్గాలతో మేము తరచు సమావేశాలు నిర్వహించుకున్నామని చెప్పారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదు సినిమా పార్టీ అని అభివర్ణించారు. విధానం సిద్ధాంతం లేని జనసేన పార్టీ. దాని గురించి మేము మాట్లాడవలసిన అవసరం లేదు. సినిమాల్లో ఉన్న వ్యక్తి సినిమా స్టైల్ లో మాట్లాడితే సినిమాల్లో పనికొస్తుంది. ప్రజాస్వామ్యంలో పనికిరాదు. దీన్ని సమాజం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.