ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్య, వైద్యం, వ్యవసాయానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 09:26 AM

టీడీపీ హయాంలో రాష్ట్రంలో 2900 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2014–2019 మధ్య విద్యా రంగంలో ఏం చేశారో యనమల చెప్పగలరా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలో ఏ పాఠశాలలు మూసివేశామో చెప్పగలరా అని మంత్రి సవాలు విసిరారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రైవేట్‌ స్కూళ్లకు ధీటుగా ఉండాలనే నాడు–నేడు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com