ఇండియాలో ఇప్పుడు ప్రజా సేవల విధానం అత్యంత సమర్ధంగా నడుస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి ఆయ్యాక ప్రజాసేవలపై దృష్టి సారించారు అని విజయ్ సాయి రెడ్డి తెలియజేసారు. అయన మాట్లాడుతూ..... అంతకు ముందు ఏ కాంగ్రెస్ సీఎం ఆలోచించని రీతిలో కొత్త మార్గాలను ఆయన ఎంచుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం అవసరమైన ప్రజానీకం సంక్షేమంపై ఆలోచించారు. సాగు సంక్షోభంతో ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగానికి తక్షణ ఊరట కల్పించడానికి వెంటనే అనేక చర్యలు తీసుకున్నారు. తన ఐదున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందనే భరోసా ఇచ్చారు అని తెలియజేసారు.