జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ ఘాటు విమర్శలు చేశారు. పవన్ కంటే కేఏ పాల్ నయమని వ్యాఖ్యానించారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీకి సిద్ధమని కేఏ పాల్ ప్రకటించారన్నారు. ఆయనకు ఉన్న ధైర్యం పవన్‌కు లేదన్నారు. జనసేన కార్యకర్తలంతా పవన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. అయితే పవన్ మాత్రం చంద్రబాబును సీఎం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు.