తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి ఆకలికేకలు వినిపించకూడదని జిల్లా ఇంచార్జ్ డీసీహెచ్ఎస్ బనావత్ చిన్నకోపి నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలను సందర్శించారు. బీసీకే నాయక్ మాట్లాడుతూ. స్థానిక ఆస్పత్రి సలహా సంఘం కమిటీ సభ్యులను సంప్రదించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు భోజనం వసతి కల్పించాలన్నారు.