మానవ హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తహశీల్దారు భాగ్యలత తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కలికిరి మాదిగపల్లిలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ తమ హక్కులు, విధులపై అవగాహన కలిగి ఉండి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎంపిడిఓ గంగయ్య, ఏఎస్ఐ మహబూబ్ బాష, ఎస్సి నాయకులు యేసు రాజు, ప్రజలు పాల్గొన్నారు.