బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్లో ఈనెల 13, 14వ తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ సైన్స్ నమూనాలను తయారు చేయడంలో విద్యార్థులను ప్రోత్సహించడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.