జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మైనింగ్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు పిలిచింది. రాంచీలోని ఈడీ కార్యాలయానికి గురువారం రావాలని సూచించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి సహాయకుడు పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ గతంలో అరెస్టు చేసింది. పంకజ్ మిశ్రా అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈడీ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa