అప్పుల బాధ తాళలేక మనస్థాపoతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శావల్యాపురం మండలం బొందిలి పాలెంలోని కొత్తూరులో వేణుగోపాల్ (21) ఐటిఐ పూర్తి చేసి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. తండ్రికి తెలియకుండా గ్రామంలోని కొంతమంది దగ్గర వేణుగోపాల్ కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అప్పును తీర్చలేక మనస్థాపానికి గురై అక్టోబర్ 23న ఎలుకల మందు తాగాడు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.