దేవరాపల్లి మండలం కలికగోట్లలో ప్రోక్కిలైన్ ద్వారా ఇసుక తవ్వకాలు జరగడం ప్రమాదకరమని సిపిఎం మండపడుతుంది. ఈ విషయంలో నిపుణులు ఆందోళన చెందుతున్నారని ఆ పార్టీ ప్రతినిధి వెంకన్న అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శారదా నదిలో యాభై ఆడుగులు లోతుల్లోకి ప్రోక్కిలైన్ ద్వారా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల. భూగర్భజలాలు ఎండిపోయి బావితారాలకు ప్రమాదం వాటిలలితాదని ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను, రవాణాను ఆరకట్టడం ద్వార ఇసుక పాలసీని రూపోందించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందనీ అన్నారు.