మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గజపతినగరం ఎస్. ఐ సి. హెచ్ గంగరాజు హెచ్చరించారు. గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్లో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.