మదనపల్లి మండలంలో ఎంపిడిఓ కార్యాలయం నందు బుధవారం జరిగిన స్పందన కార్యక్రమానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరైయ్యారు. ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్న పెద్ద ఎత్తున స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరై ఎంపీ కి ఘనంగా స్వాగతం పలికారు. మదనపల్లి నియోజకవర్గం తో పాటు తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి తమ సమస్యలు ఎంపీ దృష్టి కి తీసుకెళ్లాడానికి వర్షం లెక్క చేయక అర్జీ దారులు హాజరై వారి సమస్యలు ఎంపీకి మొర పెట్టుకొని అర్జీలు అందజేశారు.