చక్రాయపేట మండలం గండి వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం వేదపారాయణం, పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో ముకుందారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వేదపారాయణదార్ రామ్మోహన్ శర్మ, అనంతశర్మ, ఆలయ అర్చకుల పర్యవేక్షణలో యాగశాల ప్రవేశం, త్రికాల ఆరాధన, తదితర పూజలు, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ రాఘవేంద్రప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.