గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో సబర్మతి నదిపై నిర్మించిన ఆకర్షణీయ అటల్ వంతెనపైకి ఇకపై గంటకు 3 వేలమంది చొప్పున మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు. మోర్బీ విషాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అహ్మదాబాద్ నగరపాలక సంస్థ తెలిపింది. వాస్తవానికి ఒకేసారి 12 వేలమంది బరువును మోయగల సామర్థ్యం వంతెనకు ఉందని.. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా గంటకు 3 వేల కంటే ఎక్కువ మందిని దానిపైకి అనుమతించబోమని నగరపాలక సంస్థ వెల్లడించింది.