టీడీపీ సీనియర్ నేత అన్నయ్యపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గురువారం తెల్లవారుజామున వారిని అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ సీఆర్పీసీ 50ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఇటీవల గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని, మంగళగిరి సీఐడీ పీఎస్ లో నమోదైన కేసులో అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.