ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని 11న విశాఖ చేరుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారని, 12న ఉదయం బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. ఈ సందర్భంగా రూ.12 వేల కోట్ల విలువైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అంతా సంతోషించా ల్సిన విషయమన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి తనతోపాటు పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, మరికొందరితో కమిటీని నియమించారని తెలిపారు.