గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని, అందులో 95 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైన నేపథ్యంలో కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు.