ఏపీలోని విశాఖలో నలుగురు టెన్త్ విద్యార్థినులు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. క్వీన్ మేరీ స్కూల్ లో చదువుతున్న నలుగురు విద్యార్థినులు బుధవారం సాయంత్రం ట్యూషన్ కి వెళ్తున్నట్లు చెప్పి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికి, గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులు తమ గురించి వెతకవద్దని ఓ లేఖను రాశారు. లక్ష్మీ, రేణుక, హన్సిక, యమున అదృశ్యమైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.