దొంగల తెలివితేటలు మాములుగా ఉండవు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో న్యూస్ పేపర్ సాయంతో ఇంటిని గుల్ల చేశారు. ఓ కుటుంబం ఇటీవల వైష్ణో దేవీ యాత్రకు వెళ్లింది. వచ్చి చూసే సరికి ఇంట్లో ఉన్న రూ.10 లక్షలు విలువ చేసే ఆభరణాలు కనిపించలేదు. అయితే, న్యూస్ పేపర్‌ను ఇంటి ముందువేసి ఈ దొంగతనం చేశారు. రెండు రోజులైన వేసిన చోటే అది ఉండడంతో ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఈ దొంగతనానికి పాల్పడటం గమనార్హం. నిజానికి ఆ ఇంట్లో ఎవరూ న్యూస్‌పేపర్‌ను తెప్పించుకోవడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa