ప్రస్తుతం చర్మంపై ముడతలు, మచ్చలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడేవారు బియ్యప్పిండిలో ఒక చెంచా కీరదోస రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంపై ముడతలు మరియు మచ్చలను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై మురికి ఉంటే టొమాటోను స్క్రబ్బర్‌గా ఉపయోగించాలి. టొమాటో ముక్కలో ఒక చెంచా తేనె, అర చెంచా బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.