దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య పరిస్థితుల కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితులు మెరుగుపడే వరకు ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది. కాలుష్య నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. 5వ తరగతి పైన అన్ని తరగతులకు బహిరంగ కార్యకలాపాలు ఉండవని చెప్పారు.