గుంతకల్లు పట్టణంలోని కేసి. నారాయణ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల బస్సు శుక్రవారం కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోను గ్రామ సమీపంలో బోల్తా పడిన ఘటనలో విద్యార్థులకు పెను ప్రమా దం తప్పింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు. కేసి నారాయణ పాఠశాల బస్సు యధావిధిగా కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నుండి 30 మంది విద్యార్థులతో బయలు దేరింది. ఐతే బెల్డోను గ్రామ సమీపంలో మరో వాహనం ఎదురు గా రావడంతో రోడ్డు అంచుగా వెళుతుండగా అక్కడ మట్టి ఉండ డంతో పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఐతే ఒక్క విద్యార్థికి కూడా గాయాలు కాలేదు. దీంతో స్కూల్ యాజమాన్యంతో పాటు తల్లి దండ్రులు ఊపిరి పీల్చు కున్నారు.