కొమ్మమూరు కాలువ కింద సాగవుతున్న కారంచేడు మండలంలోని వరి పంటకు ఆకుముడత తెగులు వ్యాపించి రైతులు ఆందోళన చెందుతున్న నేపధ్యంలో వ్యవసాయ శాఖాధికారి నాగ శివప్రసాద్ గురువారం అనేక గ్రామాల్లో ఆయా పంటపొలాలను సందర్శించారు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుల కారణంగా ఈ తెగులు సోకింది ఆయన రైతులకు చెప్పారు. అయితే ఆందోళన చెందనవసరం లేదని, కోరబన్ పిచికారి ద్వారా ఆకుముడత తెగులును పోగొట్టవచ్చునన్నారు. రైతులకు ఇంకా అవసరమైన అనేక సూచనలు ఆయన కలిశారు