యస్సి వర్గీకరణ సాధనలో భాగంగా మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గోని సభను విజయవంతం చేయాలని మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా ఇంచార్జి గుడిశెనపల్లి నరసింహులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, కమిటీల నిర్మాణం, గ్రామ స్థాయిలో ఉద్యమ బలోపేత అంశాల గురించి మంద కృష్ణ మాదిగ వివరిస్తారని తెలిపారు.
కావున నవంబర్ 20 న మహబూబ్ నగర్ లో జరుగు జాతీయ కార్య వర్గ సమావేశాన్ని విజయవంతం చేయడానికి గ్రామ స్థాయి నుండి విద్యార్థులు సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ ఒరుగంటి కైలాష్ మాదిగ, ఎం ఎస్ పి మండల కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.