టీ20 వరల్డ్ కప్ లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 35 రన్స్ తేడాతో గెలిచింది. 186 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నెర్ కీలక సమయంలో రెండు వికెట్లతో ఐర్లాండ్ పతనానికి కారణమయ్యాడు. ఇష్ సోధి కూడా 2 వికెట్లు తీశాడు. లూకీ ఫెర్గూసన్ 3 వికెట్లతో ఐర్లాండ్ ను దెబ్బ తీశాడు. పాల్ స్టిర్లింగ్ (27 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆండీ బాల్ బర్నీ (25 బంతుల్లో 30; 3 సిక్సర్లు) మినహా మిగిలిన వారు విఫలం అయ్యారు.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ కు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్ బర్నీ శుభారంభం అందించారు. వీరు వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. తొలి వికెట్ కు 68 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని సాంట్నెర్ విడదీశాడు. బాల్ బర్నీని బౌల్డ్ చేసిన శాంట్నెర్ కివీస్ కు బ్రేక్ ఇచ్చాడు. మరో ఎండ్ లో ఇష్ సోధి పాల్ స్టిర్లింగ్ ను బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి ఐర్లాండ్ పతనం మొదలైంది. ఆసీస్ పై బాగా ఆడిన టక్కర్ (13) ఆ ప్రదర్శనను మరోసారి రిపీట్ చేయలేకపోయాడు. చివర్లో డాక్ రెల్ (23) మూడు ఫోర్లు బాదినా అది ఐర్లాండ్ ఓటమిని ఆపలేకపోయింది.