తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో కార్పోరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టారు. ఈ క్రమంలో ఇళ్ళు కూల్చివేతకు సిద్దమయ్యారు. ఇందుకోసం చేరుకున్న ప్రొక్లెయన్ లను గ్రామస్థులు అడ్డకున్నారు. ఈక్రమంలో నిరసన వ్యక్తం చేస్తన్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 120 అడుగుల రోడ్డు మాకు వద్దు అని నివాస స్థలాలు పోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన మీటింగ్ కు స్ధలం ఇచ్చిన కారణంగానే తమ గ్రామంపై రాజకీయ నాయకులు కక్షకట్టి ఇళ్ళు కూల్చుతున్నారని అన్నారు.