లాంగ్ మార్చ్ ర్యాలీ సందర్భంగా కాల్పుల్లో గాయపడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై జరిగిన దాడిపై స్పందించారు.దాడి జరుగుతుందని ఒకరోజు ముందే తెలిసిందన్నారు. తనను వజీరాబాద్‌లో కాకుండా గుజరాత్లో హతమార్చేందుకు ప్రణాళికలు రచించినట్లు తన వద్ద సమాచారం ఉందని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని అన్నారు. నలుగురు వ్యక్తులు నన్ను చంపేందుకు కుట్ర పన్నారు అని తెలిపారు.