ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత భారీగా ఉద్యోగులను సంస్థ తొలగిస్తోంది. ఇప్పటికే 50 శాతం ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ సేఫ్టీ అండ్ ఇంటెగ్రిటీ హెడ్ యోయెల్ రోత్ తాజాగా ధృవీకరించారు. ఇంజినీరింగ్, కమ్యూనికేషన్స్, ప్రొడక్ట్, కంటెంట్ క్యూరేషన్, మెషీన్ లెర్నింగ్ ఎథిక్స్ విభాగాల్లో సిబ్బందిని అధికంగా తొలగించినట్లు తెలిపారు. భారత్‌లో మార్కెటింగ్ విభాగంలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది.