T20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12 దశలో ముగుస్తుంది. గ్రూప్ '1' నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టును నేడు తేలనుంది. న్యూజిలాండ్ ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరుకుంది. న్యూజిలాండ్‌తో పాటు సెమీస్‌కు చేరిన రెండో జట్టు మరికొద్ది గంటల్లో తేలనుంది. గ్రూప్ '1'లో భాగంగా ఇంగ్లండ్ మరికొద్ది సేపట్లో సిడ్నీలో శ్రీలంకతో తలపడనుంది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఈ కీలక పోరులో ఇంగ్లండ్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఒక మార్పు చేసింది. మధుషన్ స్థానంలో కరుణత్నే జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచినా ఓడినా దానితో సంబంధం లేదు. శ్రీలంక జట్టు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.