టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు గంజాయి దొంగ, భూ కబ్జాదారుడని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. అయ్యన్న ఇరిగేషన్ కాలువను ఆక్రమించుకున్నారని తెలిపారు. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి స్టే తెచ్చుకున్నాడని చెప్పారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు చేసిన అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు భరించలేక నియోజకవర్గ ప్రజలందరూ అయ్యన్నను నియోజకవర్గం నుంచి తరిమికొట్టాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అచ్చెన్నాయుడుని కూడా నియోజకవర్గంలో అడుగుపెడితే తరిమికొడతామని ప్రజలందరూ హెచ్చరిస్తున్నారు అని అయన తెలిపారు.