దేశరాజధానిలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రమైన స్థితికి చేరుకుంది. దీంతో రాజధానిని పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీటిని పిచికారీ చేయడానికి యాంటీ స్మోగ్ గన్ ఉపయోగిస్తూ పొగమంచు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీడియోలో కుతుబ్ మినార్ ప్రాంతంలో పిచికారీ దృశ్యాలు చూడవచ్చు.