దేశంలోని 5 రాష్ట్రాల్లో సాగు చేసేందుకు జన్యుమార్పిడి ఆవాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హక్కుల కార్యకర్త అరుణా రోడ్రిగ్స్ దీనిపై సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 10న విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ దినేశ్వరి, జస్టిస్ సుధాన్షులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈలోపు దీనిపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.