రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చలేని ప్రభుత్వం రహదారి విస్తరణ పేరుతో ఇళ్లు కూలగొడుతోందని పవన్ విమర్శించారు. ఏపీలోని గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. పోలీసులు ఆయన కారును అడ్డుకోగా, కొంత దూరం నడిచి వెళ్లారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందునే గ్రామస్తులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ఇడుపులపాయలో హైవే వేస్తామని పవన్ హెచ్చరించారు.