దేశరాజధానిలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో కాలుష్య కట్టడికి ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. అత్యవసర, నిత్యావసర వస్తువులను తరలించే మినహా మిగతా డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.20 వేల వరకు జరిమానా విధిస్తామని రవాణా శాఖ హెచ్చరించింది.బీఎస్3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ వాహనాలకు ఎంట్రీ లేదని తెలిపింది.